Ram charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విడుదల సిద్ధమవుతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్
- By Balu J Published Date - 07:06 PM, Sun - 21 April 24

Ram charan: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 రోజుల పాటు జరగాల్సి ఉంది. రామ్ చరణ్ తన పోర్షన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి మరో 20 రోజులు, రామ్ చరణ్ లేకుండా మరో 30 రోజులు షూట్ చేయాల్సి ఉంటుంది. మే నెలాఖరులోగా చరణ్ తన పని పూర్తి చేస్తాడు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలై వారం రోజుల పాటు కొనసాగనుంది. చరణ్, ఎస్.జె.సూర్యలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ నెలాఖరులో విడుదల కానుందని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ గేమ్ ఛేంజర్ నుంచి సెకండ్ సింగిల్ సమ్మర్ తర్వాత విడుదల కానుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ మధ్య నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు రామ్ చరణ్.