Mahesh Babu: స్టైలిష్ లుక్ లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రిన్స్ మహేష్ కొత్త ఫోటోషూట్
స్టైలిష్ లుక్ లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రిన్స్ మహేష్ కొత్త ఫోటోషూట్ టాలీవుడ్ లో మాత్రమే భారత సినీ పరిశ్రమలో అత్యంత హ్యాండ్సమ్ హీరోల్లో ప్రిన్స్ మహేశ్ ముందు ఉంటారు.
- Author : Maheswara Rao Nadella
Date : 06-04-2023 - 5:51 IST
Published By : Hashtagu Telugu Desk
స్టైలిష్ లుక్ లో అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రిన్స్ మహేష్ (Mahesh Babu) కొత్త ఫోటోషూట్ టాలీవుడ్ లో మాత్రమే భారత సినీ పరిశ్రమలో అత్యంత హ్యాండ్సమ్ హీరోల్లో ప్రిన్స్ మహేశ్ ముందు ఉంటారు.

వయసుతో పాటు మన టాలీవుడ్ ప్రిన్స్ అందం కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతీ సినిమా అద్భుతమైన మేకోవర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు ప్రిన్స్ .

తాజాగా అద్భుతమైన లుక్స్ తో ఉన్న ఫొటోలను మహేశ్ (Mahesh Babu) తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఓ వింటేజ్ కారులో కూర్చొని, పక్కన స్టయిల్ గా నిలబడి ఉన్న ఈ ఫొటోలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి.

త్రివిక్రమ్ సినిమా కోసం కొంచెం ఒత్తయిన హెయిర్ స్టయిల్ లో మహేశ్ లుక్స్ కేక పుట్టిస్తున్నాయి.

ప్రముఖ వస్త్రాల కంపెనీ ఒట్టో ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫొటోలను తీశారు.

ఒట్టో షర్ట్స్ వేసుకున్న మహేశ్ ఫొటోలు ఇప్పుడు ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతున్నాయి.

మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
Life in luxury! #Otto pic.twitter.com/aSiJUTWVTT
— Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2023