Baby Bump : ముచ్చటగా మూడోసారి అంటున్న ‘సై’ బ్యూటీ
Baby Bump : జెనీలియాను రితేష్ వెనుక నుండి హగ్ చేస్తూ, ఎంతో ప్రేమతో ఫోజిచ్చారు. ‘‘Special One’’ అనే క్యాప్షన్‌తో లవ్ ఎమోజీలు జతచేయడం ఈ విషయాన్ని మరింత ముద్ర వేస్తోంది
- By Sudheer Published Date - 04:33 PM, Fri - 30 May 25

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచిన నటి జెనీలియా (Genelia )..ఇప్పుడు ఆమె పర్శనల్ మేటర్ తో వార్తల్లో నిలిచింది. సత్యం సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన జెనీలియా, బొమ్మరిల్లు, హ్యాపీ, సై, నా అల్లుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ తార స్థాయిలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
Vijay Thalapathy: సూర్యుడికి, వరుణుడికి కులం, మతం ఉందా?
2012లో రితేష్‌తో ఘనంగా వివాహం చేసుకున్న జెనీలియా, ఇద్దరు కుమారులైన రియాన్, రహీల్‌కు తల్లిగా మారి తల్లితనంలో తలమునకైపోయారు. ఆ మధ్య జెనీలియా సినిమాలలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చర్చ జరిగింది. ఆమె కొన్ని ప్రాజెక్టులకూ కమిట్ అయినట్టు ప్రచారం జరిగింది. ఈ వార్తలు నిజమే కావొచ్చని అభిమానులు భావిస్తున్న క్రమంలో ఆమె మూడోసారి తల్లి (Genelia Pregnant 3rd time ) కాబోతున్నట్టు పుకార్లు రావడంతో జంట వీటిని ఖండించింది. అయితే తాజాగా రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియాతో కలిసి ఉన్న బేబీ బంప్ ఫోటోను షేర్ చేయడంతో, వీరు మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారని స్పష్టమైంది.
ఆ ఫోటోలో జెనీలియాను రితేష్ వెనుక నుండి హగ్ చేస్తూ, ఎంతో ప్రేమతో ఫోజిచ్చారు. ‘‘Special One’’ అనే క్యాప్షన్‌తో లవ్ ఎమోజీలు జతచేయడం ఈ విషయాన్ని మరింత ముద్ర వేస్తోంది. ఇప్పటికే ఇద్దరు కుమారుల తల్లిగా ఉన్న జెనీలియా ఇప్పుడు మూడోసారి గర్భవతిగా ఉండటం పట్ల సినీ ప్రియులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈసారి అమ్మాయే పుట్టాలి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా జెనీలియా తిరిగి ఇండస్ట్రీకి రీఎంట్రీ కొంత ఆలస్యమవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.