Gautham Vasudev menon: ఆ సినిమాలు చేయడానికి సౌత్ హీరోలు ముందుకు రావడం లేదు.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ కామెంట్స్ వైరల్!
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ హీరోలు రొమాంటిక్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- By Anshu Published Date - 04:00 PM, Wed - 5 March 25

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి మనందరికీ తెలిసిందే. చాలా సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమ్. అయితే తాజాగా గౌతం మీనన్ బెంగుళూరు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలని ఉందని కానీ దక్షిణాదిలో ఏ హీరో కూడా అందుకు ఒప్పుకోవడం లేదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు,తమిళం, కన్నడలో కూడా పలువురు హీరోలను సంప్రదించాను. రొమాంటిక్ కథ ఉందని చెప్పగానే వాళ్లు మీటింగ్ ను వాయిదా వేస్తున్నారు. కొందరేమో కలవడానికే ఇష్టపడటం లేదు. అది ఎందుకనేది మీరే వారిని అడగండి. అయితే నా దగ్గర కథలకు కొదవలేదు. అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నాను. సినిమాలు తెరకెక్కించడమన్నా.. ప్రజలను థియేటర్ కు తీసుకురావడమన్నా నాకెంతో ఇష్టం. అదే సమయంలో నేను తీసే ప్రతి చిత్రం కూడా ప్రయోగాత్మకమైనదే! కాఖా కాఖా చిత్రం రిలీజైన మొదట్లో ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు.
కానీ నెమ్మదిగా అది అందరికీ నచ్చింది. ఓటీటీలకు జనాలు అతుక్కుపోయిన ఈ రోజుల్లో వారిని థియేటర్ కు రప్పించడం దర్శక నిర్మాతలకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. దీనికి ఎలాంటి మార్గం కనిపెట్టాలో నాకు అర్థం కావడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇక మీదట అయినా గౌతమ్ మీనన్ తో రొమాంటిక్ సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తారేమో చూడాలి మరి. అయితే తాజాగా గౌతమ్ మీనన్ చేసిన వాఖ్యలు చూస్తే నిజం అని అనిపించక మానదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాలలో హీరోలు యాక్షన్,కామెడీ, మాస్, క్రైమ్ త్రిల్లర్ సినిమాల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు