Gangavva : బిగ్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు..?
Gangavva Heart Attack : గంగవ్వ హౌజ్‌లోకి వచ్చి వారం దాటిన తర్వాత ఇప్పుడు ఆమెకు సడన్‌గా గుండెపోటు వచ్చిందన్న వార్త అందరి షాక్ కు గురి చేస్తుంది
- By Sudheer Published Date - 10:55 PM, Tue - 22 October 24

యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వ కు గుండెపోటు వచ్చిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ సభ్యురాలిగా ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఆడుతూ..తోటి సభ్యులతో చాల మంచిగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె గుండెపోటుకు గురైందనే వార్త బయటకు రావడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
Gangavva : గంగవ్వ (Gangavva ) ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం.. జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఈమె..పెద్దగా చదువు కోకపోయిన..తన మాట తీరు తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వ్యవసాయం చేసుకుంటూ ఉండే ఈమె జీవితాన్ని బిగ్ బాస్ షో (Bigg Boss Show) మార్చేసింది. అప్పటి వరకు మై విలేజ్ షో (My Village Show) అనే యూట్యూబ్ ఛానల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకోగా..ఆ గుర్తింపు తో బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది. ఈ షో తో మరింత పాపులర్ అయ్యింది. ఈ షో నుండి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు సైతం తలుపు తట్టాయి. అలాగే ఈ షో ద్వారా భారీగానే రెమ్యూనరేషన్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ వీడియో తో పాటు అప్పుడప్పుడు వెండితెరపై కనిపిస్తూ వస్తుంది.
కాగా ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్8 (#BiggBossTelugu8) కొనసాగుతుండగా..మరోసారి గంగవ్వకు పిలుపు రావడం తో ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన రోజు నుండే మిగతా హౌస్ సబ్యులకు పోటీ ఇస్తూ..తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గంగవ్వకు అనారోగ్య సమస్యలు ఎదురై ఆస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గంగవ్వ హౌజ్‌లోకి వచ్చి వారం దాటిన తర్వాత ఇప్పుడు ఆమెకు సడన్‌గా గుండెపోటు వచ్చిందన్న వార్త అందరి షాక్ కు గురి చేస్తుంది.
గంగవ్వ(Gangavva)కు గుండెపోటు రావడంతో ఇతర కంటెస్టెంట్స్ భయ ఆందోళకు గురయ్యారని, విష్ణుప్రియ చాలా టెన్షన్ పడినట్లు కొందరు బిగ్ బాస్ రివ్యూవర్స్ చెపుతున్నారు. గంగవ్వకు ప్రస్తుతం చికిత్స అందించేందుకు ప్రత్యేక డాక్టర్స్ బృందం బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తుండడతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా ఫ్రాంక్ అని కొందరు చెబుతుండగా.. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందంటూ కూడా అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Read Also : #BengaluruFloods: బెంగళూరు రోడ్లపై చేపలు వేట