Game Changer Talk : గేమ్ ఛేంజర్ పబ్లిక్ టాక్
Game Changer Talk : కొంత మంది మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతోంది అని చెబుతున్నారు
- By Sudheer Published Date - 07:58 AM, Fri - 10 January 25

గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగింది. దాదాపు మూడేళ్ళ పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ఎలా ఉంటుందో..? రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందొ..? కథ ఏంటో..? శంకర్ ఏ రేంజ్ లో తెరకెక్కించాడో..? అంటూ అభిమానులు కొద్దీ రోజులుగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఆ ఎదురుచూపులు తెరపడింది. వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు , సినీ ప్రేక్షకులు సినిమా ఎలా ఉందొ..సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు
హీరో ఎంట్రీ అదిరిపోయిందని, ఇంటర్వెల్ సినిమాకే హైలెట్ అవుతుందని , ప్రథమార్దంలో వచ్చే డోప్ సాంగ్ పిక్చరైజేషన్, అసలు ఆ పాటను అలా ఆలోచించడం గ్రేట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఐఏఎస్‌గా రామ్ నందన్ యాక్టింగ్, కియారాతో జోడి, ఇంటర్వెల్ బ్లాక్ ఇవన్నీ సినిమాకు హైలెట్ అవుతాయని కొంతమంది అంటున్నారు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్‌కు వంక పెట్టలేమని చెబుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతోంది అని చెబుతున్నారు. ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్‌తో అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. అదే ఈ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలెట్ అవుతుందని అంతా అంటున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలో ఎస్.జే సూర్య నటనతో ఆకట్టుకున్నాడు.కియారా అద్వానీకి కథలో పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్టు అనిపించలేదు.అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. కామెడీ ఏమాత్రం లేకపోవడం మైనస్ అంటున్నారు. శంకర్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కథలో కొంత గందరగోళం కనిపించింది అని చెపుతున్నారు. ఓవరాల్ గా మాత్రం పక్క మాస్ ఎంటర్టైనర్ అని చెపుతున్నారు.