Bigg Boss Promo: ఇనాయను ఘోరంగా అవమానించిన గీతూ, శ్రీ సత్య!
బిగ్ బాస్ హౌస్ లో గలాటా గీతూ రెచ్చిపోతూ నోటికి ఎంత వస్తే అంత మాట అంటోంది. ప్రేక్షకులు సైతం గలాట గీతూ
- By Nakshatra Published Date - 05:17 PM, Mon - 19 September 22
బిగ్ బాస్ హౌస్ లో గలాటా గీతూ రెచ్చిపోతూ నోటికి ఎంత వస్తే అంత మాట అంటోంది. ప్రేక్షకులు సైతం గలాట గీతూ వాయిస్ పై సెటైర్లు వేస్తున్నారు. ఆమె నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆమెపై ఇప్పటికే బోలెడన్ని ట్రోలింగ్స్, కౌంటర్ లు వేస్తున్నారు. అయినా కూడా ప్రతిసారి గలాటా గీతూ సేవ్ అవుతూనే ఉంది. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఆమె టాస్కుల విషయంలో కసిగా ఆడుతూ ఎలా అయినా గెలవాలి అని ఆడుతూ ఉండడంతో ఆమె ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఆమెకు ఓట్లు పడి సేవ్ అవుతూ వస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే గీతు నామినేషన్స్ లో కూడా సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక మూడో వారం నామినేట్ లో భాగంగా గీతూ వర్సెస్ ఇనయ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు రెచ్చిపోయారు. నేపథ్యంలోనే గీతూ మాత్రం కాస్త అదుపు తప్పి ఇనయ ని దొబ్బేయ్ దొబ్బేయ్ నీ సోది అంటూ చిరాకుగా అనగా అప్పుడు ఇనయ కూడా గీతూ కీ ఏమాత్రం తగ్గకుండా నువ్వే దొబ్బేయ్ అని కౌంటర్ వేసింది.
మొత్తానికి ఈ మూడో వారం నామినేషన్ ప్రక్రియ మాత్రం ఓ రేంజ్లో జరిగినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే నిన్న అనగా ఆదివారం బిగ్బాస్ హౌస్లో రెండవ వారం ఎలిమినేషన్ లో భాగంగా అభినయశ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ వారం పూర్తి అవ్వగానే ప్రేక్షకులకు మూడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకొంది.
Related News
Joe Biden: మరోసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బెడైన్ నామినేషన్ ఖరారు
Joe Biden: అమెరికా దేశాధ్యక్షుడు జో బెడైన్(Joe Biden) మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా(presidential candidate)పోటీ పడనున్నారు. ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన నామినేషన్ ఖరారు అయ్యింది. బహుశా ఆయన తుది పోరులో రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్(Donald Trump)తోనే అధ్యక్ష రేసులో పోటీపడే ఛాన్సు ఉందని అమెరికా మీడియా పేర్కొన్నది. అమెరికాలోని గడిచిన 70 ఏ�