Jajimogulali Lyrical Video: ఉర్రూతలూగిస్తున్న ‘రుద్రంగి’ ఫోక్ సాంగ్ ‘జాజిమొగులాలి’
'జాజిమొగులాలి' అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు పాడగా బిగ్ బాస్ ఫేమ్ దివి వాడ్త్య ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్.
- Author : Balu J
Date : 07-02-2023 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రంగి’ సినిమాలోని ముఖ్య పాత్రలను రివీల్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన ఈ టీం తాజాగా ఫోక్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘జాజిమొగులాలి’ అంటూ సాగే ఈ పాటని మోహన భోగరాజు పాడగా బిగ్ బాస్ ఫేమ్ దివి వాడ్త్య ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్. ఒకవైపు తన అందాలతో అలరిస్తూనే ఫోక్ సాంగ్ బీట్ కి భాను మాస్టర్ కోరియోగ్రఫీ లో అద్భుతంగా డాన్స్ చేసింది దివి.
పూర్తి తెలంగాణ యాసలో సాగే ఈ జానపద పాటకి క్యాచి లిరిక్స్ అభినయ శ్రీనివాస్ అందించగా సంగీతం నాఫల్ రాజా ఏఐఎస్ అందించారు. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ హంగులతో ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పైప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.