Fish Venkat : విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..ఆదుకునేందుకు చిత్రసీమ దూరం..ఎందుకు ?
Fish Venkat : ఈ విషయంపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. చిత్రసీమలో ఇప్పుడు ఎవరి దారి వాళ్లదేనని, ఇలాంటి పరిస్థితులకు మనమే ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అన్నారు
- By Sudheer Published Date - 05:06 PM, Fri - 11 July 25

ప్రముఖ తెలుగు కమెడియన్ ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా బలహీన స్థితిలో ఉన్న వెంకట్ కుటుంబం, సినీ ప్రముఖులను అభ్యర్థిస్తూ సాయం కోరింది. అయితే కొన్ని మినహా పెద్ద పెద్ద హీరోల నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులను నవ్వించటంలో ముందుండే వెంకట్‌కు అటు చిత్రసీమ, ఇటు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన అండ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Box Office War: 4 వారాల్లో రూ.1200 కోట్లు..ఎంత రాబడతాయో..?
వెంకట్ గతంలో గబ్బర్ సింగ్, ఖుషి, దిల్, బన్నీ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కామెడీ పాత్రల్లో మెప్పించారు. అయితే గతేడాది ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన పరిస్థితిని వెల్లడించగా, కొంతమంది సినీ ప్రముఖులు అప్పట్లో సహాయం చేసినట్లు సమాచారం. తాజాగా ప్రభాస్ తన తరఫున సహాయం చేశారని వార్తలు వచ్చినప్పటికీ, తనకు ప్రభాస్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని వెంకట్ కుటుంబం స్పష్టం చేసింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం పెద్ద మనసు చూపించి రూ.2 లక్షల సాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మంత్రులు కూడా వెంకట్‌ను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు. అయినప్పటికీ వెంకట్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
World Population Day : జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలి: సీఎం చంద్రబాబు
ఈ విషయంపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. చిత్రసీమలో ఇప్పుడు ఎవరి దారి వాళ్లదేనని, ఇలాంటి పరిస్థితులకు మనమే ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఒకప్పుడు సినీ పరిశ్రమ కుటుంబంలా ఉండేదనీ, ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమైపోయిందని వ్యాఖ్యానించారు. హెల్త్ మరియు ఎడ్యుకేషన్ దేశంలో ఫ్రీగా ఉండాలని కోరుతూ, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఫిష్ వెంకట్ తరచూ ట్యాక్స్ చెల్లించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు ఆయనకు అవసరమైన సమయంలో ప్రభుత్వమే ఆదుకోవాలని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ కూడా మానవతా దృక్పథంతో వెంకట్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.