Salaar Song : సలార్ ఫ్రెండ్షిప్ సాంగ్ విన్నారా? కన్నీళ్లు పెట్టాల్సిందే..
- Author : News Desk
Date : 14-12-2023 - 6:29 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్(Salaar). ఈ సినిమాని రెండు పార్టులుగా తీసుకొస్తారని ప్రకటించారు. అనేకసార్లు వాయిదా పడిన సలార్ పార్ట్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సలార్ టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ అభిమానులు అయితే సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
సలార్ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య కథ అని తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా వారం రోజులే పెట్టుకొని ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తాజాగా సలార్ సినిమా నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రభాస్ – పృథ్విరాజ్ కుమార్ ల మధ్య ఉండే స్నేహంపై సూరీడే.. అని సాగే పాటని రిలీజ్ చేశారు.
ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలో ఇలాంటి ఎమోషనల్ సాంగ్ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ పాట విన్నాక ఎవ్వరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. ఈ పాటకి తెలుగులో కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా రవి బస్రూర్ సంగీత దర్శకత్వంలో హరిణి ఇవటూరి పాడింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉంది.
Also Read : Bad News for Bad Guys : RGV ‘వ్యూహం’ నికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్..