Bangarraju Trailer: బంగార్రాజు ట్రైలర్ రిలీజ్.. తండ్రికొడుకుల జోరు అదుర్స్!
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
- By Balu J Published Date - 08:40 PM, Tue - 11 January 22

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే భారీ స్పందన లభిస్తోంది. నాగార్జున, చైతూ ఆ పాత్రల కాంబినేషన్లోని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక వైపున స్వర్గంలో అప్సరసల మధ్య నాగార్జున అల్లరి అల్లరి .. ఇక నాగచైతన్య భూలోకంలో పల్లెటూరి అమ్మాయిలతో రోమాన్స్ చేస్తూ ఆకట్టుకుంటారు. సోగ్గాడే చిన్నినాయినా మాదిరిగానే ఈ ఇందులో విజువల్స్, పండుగ వాతావరణం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ గతంలో నటించిన సోగ్గాడే చిన్నినాయినా మూవీ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ వస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు ఈ కొత్త సినిమాకి. నేచురల్ డ్రామాగా దీనిని తెరకెక్కించాడు డైరెక్టర్. అన్‌పూర్ణ స్టూడియోస్ , జీ స్టూడియోస్ కలిసి నిర్మించాయి. ఈ సినిమాలో బంగార్రాజుగా అక్కినేని నాగార్జున, చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య, సత్యభామగా రమ్యకృష్ణ, నాగలక్ష్మిగా కృతి శెట్టి, రావు రమేష్ , బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ , ఝాన్సీ, అనిత చౌదరి, సీరత్ కపూర్ , మీనాక్షి దీక్షిత్ , దర్శన బానిక్ నటించారు.