Manchu Family Fight : కలెక్టర్ ముందే తండ్రి కొడుకుల ఘర్షణ
Manchu Family Fight : కలెక్టర్ ఎదుట హాజరైన ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఘర్షణ ఎక్కువ అవుతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసి వారిని శాంతింపజేశారు
- By Sudheer Published Date - 09:48 PM, Mon - 3 February 25

మంచు ఫ్యామిలీ(Manchu Family)లో ఆస్తుల వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తన ఇంటి నుంచి మనోజ్(Manchu Manoj)ను ఖాళీ చేయించాలని మోహన్‌బాబు (Mohanbabu) చేసిన ఫిర్యాదు మేరకు రంగారెడ్డి కలెక్టర్ ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఎదుట హాజరైన ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘర్షణ పడ్డారు. ఘర్షణ ఎక్కువ అవుతున్న తరుణంలో పోలీసులు జోక్యం చేసి వారిని శాంతింపజేశారు. పంచాయతీ కుదరకపోవడంతో వచ్చే వారం మళ్లీ హాజరు కమ్మని కలెక్టర్ ఇద్దరికీ సూచించారు. ఈ వివాదంలో మోహన్‌బాబు తన ఆస్తి తన ఇష్టం అని వాదిస్తుండగా.. మనోజ్ తన శ్రమ కూడా ఆ ఆస్తిలో ఉందని, తనకు కూడా హక్కు ఉందని వాదిస్తున్నారు. ఆస్తి కోసం కాకుండా, ఆత్మగౌరవం కోసం తాను పోరాడుతున్నానని మనోజ్ తెలిపారు.
SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?
ఈ గొడవలో మోహన్‌బాబు ఆవేశం కారణంగా హత్యాయత్నం కేసు కూడా నమోదయ్యింది. జల్‌పల్లి నివాసం తనదని, అక్కడి నుంచి మనోజ్‌ను ఖాళీ చేయించాలని మోహన్‌బాబు కోరుతున్నారు. అయితే, మనోజ్ ఆ ఇంటిపై తనకు కూడా హక్కు ఉందని వాదిస్తున్నారు. ఈ వివాదం పరిష్కారం కాకుండా, మేజిస్ట్రేట్ ముందు వాదనలు కూడా పూర్తి కాలేదు. వచ్చే వారం మళ్లీ ఇద్దరూ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాల్గు గోడల మధ్య సర్దుమణిగే గొడవను కలెక్టర్ వద్ద వరకు తెచ్చుకున్నారని అంత మాట్లాడుకుంటున్నారు.