Jr NTR : ఇటుకలఫై జూ. ఎన్టీఆర్ పేరు..ఇది కదా అభిమానం అంటే..
ఏపీ కర్నూల్ కు చెందిన ఓ వ్యక్తికి..చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద పండగలా భావిస్తాడు
- Author : Sudheer
Date : 04-11-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
పురాతన కాలంలో దేవాలయాలు కట్టే క్రమంలో ఆ ఇటుకలపై, పిల్లర్లపై దేవుళ్ల ఫై పేర్లు చెక్కేవారు. కానీ ఇప్పుడు సినిమా హీరోలే దేవుళ్లుగా మారిపోయారు. గుడికి వెళ్లి దేవుడికి మొక్కుతారో లేదో కానీ..తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం ఆ పోస్టర్ లు పూలమాల వేసి , కొబ్బరికాయలు కొట్టి , పాలాభిషేకం చేస్తున్నారు. ఇంకొంతమందైతే తమ అభిమాన హీరోల పేర్లను తమ ఒంటిపై పచ్చబొట్టులాగా వేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలాంటిదే చూసాం. తాజాగా ఓ అభిమాని ఏకంగా ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించే ఇటుకలపై జూ.ఎన్టీఆర్ (Jr NTR) పేరు వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ కర్నూల్ కు చెందిన ఓ వ్యక్తికి (NTR Fan)..చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ (Jr NTR) అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద పండగలా భావిస్తాడు. థియేటర్ ను కటౌట్స్ తో నింపేయడమే కాకుండా తాను కష్టపడినా డబ్బుతో టికెట్స్ కొనుగోలు చేసే ఫ్రెండ్స్ కు సినిమాను చూపిస్తుంటాడు. అంతటితో ఆగకుండా తన అభిమాన హీరో పేరు ఎప్పుడు తన కళ్లముందే ఉండాలనే కోరికతో తన ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకల (Bricks ) ఫై ఎన్టీఆర్ పేరును వేయించుకొని తన కోరిక ను తీర్చుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇతడి అభిమానం చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ..తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. రెండు పార్ట్ లు గా రాబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also : AI Resume : రెజ్యూమె తయారీకి 6 జబర్దస్త్ ఏఐ టూల్స్
Kurnool City & Dt@tarak9999
ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు
ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt— MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023