HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Family Court Ordered Prudhvi Raj Pay Rs 8 Lakh Alimony To His Wife Every Month

Prudhvi Raj : `థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ`పై న్యాయ‌స్థానం కొర‌ఢా

`థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ’గా టాలీవుడ్‌లో పేరు సంపాదించుకున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కుటుంబ న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది

  • By CS Rao Published Date - 02:48 PM, Sat - 1 October 22
  • daily-hunt
Prudhvi Raj
Prudhvi Raj

`థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ’గా టాలీవుడ్‌లో పేరు సంపాదించుకున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కుటుంబ న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)కి 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను తరచూ వేధించేవాడని ఆరోపించారు.

5 ఏప్రిల్ 2016న తనను ఇంటి నుంచి గెంటేశాడని, దీంతో మరో దారిలేక పుట్టింటికి చేరుకున్నానని పేర్కొన్నానని ఆ ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. కేసును విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (కుటుంబ న్యాయస్థానం) న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alimony
  • family court
  • Prudhvi Raj

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd