Rishab Shetty Likes Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మై ఫేవరెట్ హీరో: కాంతారా హీరో రిషబ్ శెట్టి!
ఇటీవల విడుదలైన కాంతార మూవీ అన్ని చోట్లా రికార్డులు తిరుగరాస్తోంది. ఆ సినిమా ఎంత ఫేమస్సో.. అందులో నటించిన హీరో అంతకంటే
- By Balu J Published Date - 05:48 PM, Fri - 14 October 22
ఇటీవల విడుదలైన కాంతార మూవీ అన్ని చోట్లా రికార్డులు తిరుగరాస్తోంది. ఆ సినిమా ఎంత ఫేమస్సో.. అందులో నటించిన హీరో అంతకంటే ఫేమ్ అయ్యాడు. కాంతారా హీరో రిషబ్ శెట్టి మూవీ సక్సెస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేశాడు. టాలీవుడ్ లో తన అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని వెల్లడించాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ అద్బుతంగా నటించాడని అప్రిషియేట్ చేశారు.
టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అని రిషబ్ శెట్టి వెల్లడించారు. “మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. అతనితో మరొక అనుబంధం ఏమిటంటే, ఎన్టీఆర్ తల్లి మా గ్రామం” అని చెప్పాడు. మీరు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్‌కి దర్శకత్వం వహించాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు “నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కథ, కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రమే నేను నిర్ణయించగలను” అని రిషబ్ అన్నాడు.
రిషబ్ శెట్టి కాంతార సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలైంది. ఇది కర్ణాటక బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. కన్నడలో మాత్రమే విడుదల చేయాలని భావించారు. కానీ రెస్పాన్స్ తర్వాత మిగతా భాషల్లో రిమేక్ అవుతోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ద్విపాత్రాభినయం చేశాడు.
Related News
Chiranjeevi: 100వ సారి రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ.. మెగాస్టార్ సన్మానం
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే. వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తో�