Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్
Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.
- By Sudheer Published Date - 12:21 PM, Fri - 26 September 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయమైన ఈ హై-యాక్షన్ థ్రిల్లర్, విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ రికార్డులను సాధించింది. సినిమా రిలీజ్ అయిన రోజు ఉదయమే హౌస్‌ఫుల్ బోర్డులు కట్టడం పవన్ కళ్యాణ్ క్రేజ్‌కు నిదర్శనం. ప్రేక్షకులలో క్రేజ్, అంచనాలు, మొదటి రోజు ఫుల్ రిస్పాన్స్ ఇలా అన్ని ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మంత్రంలా నిలబెట్టాయి.
OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘OG’ భారత్‌లో తొలి రోజే (పెయిడ్ ప్రివ్యూలతో సహా) రూ. 90.25 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఈ అద్భుత ఫీట్‌తో, పవన్ కళ్యాణ్ మునుపటి చిత్రం హరి హర వీర మల్లు మొదటి రోజు కలెక్షన్లను (రూ. 34 కోట్లు) దాటేసింది. అంతేకాదు 2025లో విడుదలైన కూలీ* (రూ. 65 కోట్లు) , ఛవా (రూ. 31 కోట్లు), సైయారా (రూ. 21.5 కోట్లు) వంటి ఇతర పెద్ద చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించి, ఈ ఏడాది అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. అయితే, అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.
Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!
దేశీయ మార్కెట్లలోనే కాకుండా విదేశీ బాక్సాఫీస్‌లో కూడా ‘OG’ బలమైన హవా కొనసాగించింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం $3 మిలియన్లు (రూ. 26 కోట్లు) వసూలు చేసింది. దీనితో, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా స్థూల వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫీట్‌తో ‘OG’ ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 మూవీస్ జాబితాలోకి చేరే అవకాశముంది. పవన్ కళ్యాణ్ క్రేజ్, యాక్షన్ ప్యాక్డ్ కథనం, అలాగే దర్శకుడు సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఇలా అన్ని కలిసి ఈ సినిమా రికార్డులను తిరగరాసేలా చేశాయి.