Emmy Awards 2024: ఎమ్మీ అవార్డ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ది బేర్
Emmy Awards 2024: 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2024 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో ది బేర్ సెకండ్ సీజన్ రికార్డు క్రియేట్ చేసింది. 23 నామినేషన్లతో ఎమ్మీ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సీరీస్ గా నిలిచింది.
- By Praveen Aluthuru Published Date - 11:53 AM, Mon - 16 September 24

Emmy Awards 2024: ప్రపంచ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 76వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమయ్యాయి. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేశారు. తారలు రెడ్ కార్పెట్‌పై తమ అందాలను ప్రదర్శించారు. అత్యధికంగా డ్రామా విభాగంలో హాలీవుడ్ సిరీస్ ది బేర్ (The Bear) సెకండ్ సీజన్ రికార్డు క్రియేట్ చేసింది. 23 నామినేషన్లతో ఎమ్మీ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సీరీస్ గా నిలిచింది.
ఎమ్మీ అవార్డులు: విజేతల జాబితా
ఉత్తమ సహాయ నటి (డ్రామా) – ఎలిజబెత్ డెబికి ( దిక్రౌన్)
ఉత్తమ దర్శకుడు (డ్రామా) – క్రిమ్‌సన్ స్కై (షాగన్)
ఉత్తమ నటుడు (అంథాలజీ) – రిచర్డ్ గ్యాడ్(బేబి రెయిన్‌డీర్)
ఉత్తమ సహాయనటి (అంథాలజీ) – జెస్సికా
ఉత్తమ టాక్ సిరీస్ – ది డైలీ షో
రియాలిటీ కాంపిటీషన్ ప్రొగ్రాం – ధి ట్రైటర్స్
గవర్నర్స్ అవార్డ్ – గ్రెగ్ బెర్లాంటి
ఉత్తమ సహాయ నటుడు(కామెడీ) – ఎబోన్ మోస్ (ది బేర్)
ఉత్తమ సహాయ నటి (కామెడీ) – లిజా కోలోన్ (ది బేర్)
కామెడీ సిరీస్ బెస్ట్ యాక్టర్ (కామెడీ) – జెరెమీ అలెన్ వైట్ ( దిబేర్)
కామెడీ సిరీస్ ఉత్తమ నటి (కామెడీ) – జీన్ స్మార్ట్ (హ్యాక్స్)
ఉత్తమ సహాయ నటుడు (డ్రామా) – బిల్లీ క్రుడప్ ( ది మార్నింగ్ షో)
Also Read: Sankranti : ప్రయాణికులకు ‘సంక్రాంతి’ కష్టాలు తప్పేలా లేదు