Betting Apps Case: 29 మంది సినీస్టార్స్ పై ఈడీ కేసు నమోదు
Betting Apps Case: ఈడీ నమోదు చేసిన కేసుల్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి
- Author : Sudheer
Date : 10-07-2025 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
బెట్టింగ్ యాప్స్ కేసు(Betting Apps Case)లో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల ఆధారంగా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్‌లను పునఃసమీక్షించిన ఈడీ, మొత్తం 29 మంది సినీ ప్రముఖులపై మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద కేసులు నమోదు చేసింది. ఈ ప్రక్రియలో టాలీవుడ్‌లో ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చిక్కుకున్నారు.
Mega PTM 2.0: గిన్నిస్ రికార్డు కొట్టబోతున్న మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0
ఈడీ నమోదు చేసిన కేసుల్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అంతేకాక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రసిద్ధిచెందిన నితూ అగర్వాల్, విష్ణు ప్రియ, వసంతి కృష్ణన్, సిరి హనుమంతు, వర్షిణి వంటి సోషల్ మీడియా స్టార్స్‌పైనా అభియోగాలు వచ్చాయి. వీరంతా వివిధ విధాలుగా చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టు పోలీసులు తేల్చారు.
Shivling Puja: గర్భధారణ సమయంలో శివుడ్ని పూజించడటం వల్ల లాభాలు ఉన్నాయా?
ప్రస్తుతం ఈడీ అధికారులు వీరందరినీ పీఎమ్ఎల్ఏ కింద విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. విచారణ సమయంలో ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేయనున్నారు. మనీలాండరింగ్ కోణంలో కీలక సమాచారం వెలికితీయాలని ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర టెన్షన్‌ను రేకెత్తిస్తోంది. విచారణ అనంతరం ఎంతమంది బయటపడతారు? ఎంతమందిపై చట్టపరమైన చర్యలు పడతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.