OG Movie : ‘ఓజి’కి పోటీగా.. తమ సినిమాని తీసుకు వస్తున్న త్రివిక్రమ్ సతీమణి..
పవన్ కళ్యాణ్ 'ఓజి' మూవీకి పోటీగా తమ సినిమాని తీసుకు వస్తున్న త్రివిక్రమ్ సతీమణి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న..
- Author : News Desk
Date : 29-05-2024 - 7:11 IST
Published By : Hashtagu Telugu Desk
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘ఓజి’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు 75 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని.. ఈ ఏడాదిలోనే సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలోనే ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న స్ట్రెయిట్ సినిమా కావడం, అదికూడా గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో.. ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్ అండ్ సెలబ్రిటీస్ లో సైతం ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాంటి భారీ హైప్ ఉన్న మూవీకి ఎవరు పోటీ రావాలని అనుకోరు. కానీ పవన్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య మాత్రం.. నేను వస్తాను అంటున్నారు. ఓజి మూవీ రిలీజ్ రోజునే తాను నిర్మిస్తున్న సినిమాని కూడా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తో కలిసి సాయి సౌజన్య.. తమ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు.
డబ్బు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ మూవీని.. సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ నేడు అనౌన్స్ చేసారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Gear up to witness an extra-ordinary tale of our endearing and passionate #LuckyBaskhar in theatres from SEPTEMBER 27th! 🏦#LuckyBaskharOnSept27th 📈💵@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/K10dLWyGSU
— Sithara Entertainments (@SitharaEnts) May 29, 2024