HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dragon Beauty In A Bikini Rukmini Vasanth

Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dragon beauty in a bikini.. Rukmini Vasanth
Dragon beauty in a bikini.. Rukmini Vasanth

‘డ్రాగన్’ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోషూట్ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడూ పద్ధతైన పాత్రల్లో కనిపించే ఈ కన్నడ బ్యూటీ, సడెన్‌గా గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అక్కడ కెమెరాలు, ప్రొడక్షన్ సెటప్ ఉండటంతో ఇది ఏదైనా బ్రాండ్ షూట్ అయి ఉంటుందని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది ‘ఏఐ డీప్‌ఫేక్’ మాయాజాలం కావచ్చునని అనుమానిస్తున్నారు.

If your mind got confused between It’s Real or AI..

Believe me your Dk will also not recognise it… Go for it 💦 pic.twitter.com/3wwo2guPcQ

— Indian Celeb Hub (@IndCelebHub) May 22, 2026

రంగుల సినిమా ప్రపంచంలో గ్లామర్‌కు ఉండే క్రేజ్ వేరు. ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలన్నా, నెంబర్ వన్ స్థానంలో నిలబడాలన్నా నటనతో పాటు ఆకర్షణీయమైన రూపం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా కొంతమంది కథానాయికలు కెరీర్ ఆరంభంలో హోమ్లీ క్యారెక్టర్లు చేసి, ఆ తర్వాత మెల్లగా గ్లామర్ రూట్ ఎంచుకుంటూ ఉంటారు. అయితే, ఎప్పుడూ పద్ధతైన పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ, సడెన్‌గా వెండితెరపై గ్లామర్ బాంబు పేల్చితే అభిమానులు అస్సలు తట్టుకోలేరు. ప్రస్తుతం కన్నడ సుందరి రుక్మిణి వసంత్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. సోషల్ మీడియాలో లీకైన ఆమె బికినీ విజువల్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్.. తన అమాయకపు చూపులతో, కళ్లతోనే పలికించే హావభావాలతో కుర్రకారు మనసు దోచుకుంది. ‘కాంతార’ సీక్వెల్‌తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రుక్మిణి ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన, రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలయితే ఆమె పాన్ ఇండియా స్థాయిలో సినీ రంగాన్ని ఏలడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతో ట్రెడిషనల్ ఇమేజ్ ఉన్న ఈ కన్నడ బ్యూటీ, ఒక్కసారిగా గ్రీన్ కలర్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్‌లోకి దిగుతున్న వీడియో క్లిప్స్, ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అవ్వడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ విజువల్స్‌లో రుక్మిణి చుట్టూ కెమెరామెన్లు, లైటింగ్ బాయ్స్, టెక్నీషియన్లతో కూడిన భారీ ప్రొడక్షన్ సెటప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇది ఏదైనా అంతర్జాతీయ బ్రాండ్ ప్రమోషన్ లేదా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం అధికారికంగా చేసిన ఫోటోషూట్ అయి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. నటిగా తన రూట్ మార్చి, గ్లామర్ పాత్రలకు కూడా తాను సై అంటున్నట్లు చెప్పకనే చెబుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ఈ వీడియో, ఫోటోలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ రోజుల్లో సెలబ్రిటీల ముఖాలను మార్చేసే ‘ఏఐ డీప్‌ఫేక్’ (AI Deepfake) సాంకేతికత విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన మాయాజాలం అయి ఉండవచ్చని సందేహిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం వామ్మో.. నిజంగా ఈమె రుక్మిణేనా? అంటూ అయోమయంలో పడ్డారు.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ కెరీర్ టాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో పీక్ స్టేజ్‌లో ఉంది. భారీ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో ఈ తరహా బికినీ షూట్ వీడియోలు లీక్ కావడం ఫిల్మ్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వైరల్ కంటెంట్‌పై ఇప్పటివరకు అటు నటి రుక్మిణి వసంత్ కానీ, ఇటు ఆమె పీఆర్ టీమ్ కానీ ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఒకవేళ ఇది నిజమైన షూట్ అయితే మాత్రం రుక్మిణి గ్లామర్ డోస్ పెంచి స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొచ్చినట్లేనని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వైరల్ అవుతున్న ఈ హాట్ టాపిక్‌పై క్లారిటీ రావాలంటే ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bikini
  • NTR Dragone
  • Photo Shoot
  • Rukmini Vasanth

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd