Thalapathy Vijay: వామ్మో.. విజయ్ దళపతికి అన్ని వందల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా!
కోలివుడ్ స్టార్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
- Author : Balu J
Date : 01-09-2023 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
Thalapathy Vijay: కోలీవుడ్ నటుడు విజయ్ ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాల్లో ప్రముఖ వ్యక్తిగా మారుతున్నారు. ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు విస్తృత దృష్టిని ఆకర్షించాయి. తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల పరిణామాలను గమనిస్తే విజయ్ తన పరిధిని పెంచుకోవడానికి ప్రేక్షకులతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అందుకు సోషల్ మీడియా కూడా వాడుకుంటున్నాడు.
విజయ ప్రజాసంఘం కార్యదర్శి బుస్సి ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన సంఘం కార్యకర్తలు సమావేశమయ్యారు. వివిధ కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సభ్యులు చర్చించారు. వారు వాట్సాప్ గ్రూపుల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకోవాలని, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ఇప్పటికే దాదాపు 1,600 వాట్సాప్ గ్రూపులను రూపొందించారు. ప్రజాప్రతినిధులతో కనెక్ట్ అయ్యేందుకు, వారి సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ గ్రూపులను ఉపయోగించుకుంటారని సమాచారం. అయితే ఈ వ్యూహం గతంలో MDMK నాయకుడు విజయకాంత్ అనుసరించాడు. విజయ్ కూడా ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. మరోవైపు విజయ్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇక సినిమా విషయానికి వస్తే, విజయ్ తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాలో కనిపించనున్నాడు. భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న లియో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: Manipur Mantalu: దేశ సంపాదకుల వ్యాసాలతో ’’మణిపూర్ మంటలు‘‘ పుస్తకం