Mahesh Babu: యాడ్స్‌తో మహేశ్‌బాబు సంపాదన ఎంతో తెలుసా ?
హీరో మహేశ్ బాబు(Mahesh Babu) చాలా యాడ్స్‌లో నటించారు. ఎన్నో కంపెనీలను స్వయంగా ప్రమోట్ చేశారు.
- By Pasha Published Date - 02:50 PM, Wed - 23 April 25

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత సోమవారం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 28న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాయి సూర్య, సురానా గ్రూప్‌లకు సంబంధించిన పలు యాడ్స్‌లో హీరో మహేశ్ బాబు నటించారు. ఆయా కంపెనీలకు చెందిన ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేశారు. అందుకుగానూ మహేశ్ బాబు రూ. 5.90 కోట్లు తీసుకున్నారని ఈడీ గుర్తించింది. ఇందులో రూ. 3.4 కోట్లను నగదు రూపంలో, రూ. 2.5 కోట్లను ఆర్‌టీజీఎస్ ద్వారా మహేశ్ తీసుకున్నారని ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని సాయి సూర్య, సురానా గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో వెల్లడైంది. ఇంతకీ మహేశ్ బాబు యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా ఎంత సంపాదిస్తుంటారు అనేది ఓసారి తెలుసుకుందాం..
Also Read :NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రతి సెకనుకు కోట్ల వర్షం..
హీరో మహేశ్ బాబు(Mahesh Babu) చాలా యాడ్స్‌లో నటించారు. ఎన్నో కంపెనీలను స్వయంగా ప్రమోట్ చేశారు. ఆయన ప్రమోట్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే ఆయా కంపెనీలకు ప్రజల్లో మంచి మైలేజీ వచ్చింది. మహేశ్ బాబు ప్రమోట్ చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ ట్రెండ్స్, మౌంటెన్ డ్యూ, అభి బస్, డెన్వర్, పాన్ బహార్ పాన్ మసాలా, ఒట్టో, మ్యాన్ కైండ్ వంటివి ఉన్నాయి. వీటి యాడ్స్‌ను మనం టీవీల్లో, యూట్యూబ్‌లో చూసి ఉంటాం. ఇవి కాకుండా ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలకు ప్రచారకర్తగా మహేశ్ బాబు వ్యవహరిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ యాడ్స్‌ను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఛానల్స్‌లో మాత్రమే ఇస్తుంటాయి. ఇంకొన్ని కంపెనీలు సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, పత్రికల్లోనూ యాడ్స్ ఇస్తుంటాయి. ఈవిధంగా ప్రజలకు తమ సందేశాన్ని యాడ్ రూపంలో చేరవేస్తుంటాయి. మహేశ్ బాబు ఎంతైనా సూపర్ స్టార్ కదా. అందుకే ఆయన ఏదైనా యాడ్ చేయాలంటే ఒక సెకనుకు రూ.కోటి దాకా తీసుకుంటారట. ఒకవేళ 5 సెకన్ల యాడ్ చేస్తే.. రూ.5 కోట్ల దాకా మహేశ్‌కు లభిస్తాయి. ఈ లెక్కన ఆయన ఏడాదిలో కనీసం 10 యాడ్స్ చేసినా.. దాదాపు రూ.50 కోట్ల దాకా సంపాదిస్తారు.
Also Read :Sathya Sai Centenary: పుట్టపర్తి సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం
రకరకాల వ్యాపారాలు
ఇక సినిమాలు, ఇతర వ్యాపారాల నుంచి కూడా మహేశ్ బాబుకు మంచి ఆదాయమే వస్తోంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో నడిచే మూవీ థియేటర్స్ మహేశ్ బాబువే. AN Restaurants పేరుతో ఆయనకు రెస్టారెంట్స్ వ్యాపారం కూడా ఉంది.