Director Trinadha Rao Nakkina : నాగ్ హీరోయిన్ పై డైరెక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
Director Trinadha Rao Nakkina : "అన్షు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా, తెలుగుకు సరిపోదు" అని వ్యాఖ్యానించారు
- Author : Sudheer
Date : 12-01-2025 - 8:37 IST
Published By : Hashtagu Telugu Desk
‘మన్మథుడు’ ఫేమ్ హీరోయిన్ అన్షు (Anshu ) గురించి డైరెక్టర్ త్రినాథరావు నక్కిన (Director Trinadha Rao Nakkina) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘మజాకా’ సినిమా ఈవెంట్ (Majaka Movie Teaser Launch) సందర్భంగా త్రినాథరావు అన్షు గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.
Home Minister Anitha : మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
ఈవెంట్‌లో త్రినాథరావు మాట్లాడుతూ .. “అన్షు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా, తెలుగుకు సరిపోదు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు అన్షుపై వ్యక్తిగత విమర్శలుగా నిలిచాయి. డైరెక్టర్ మాట్లాడిన తీరును నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక డైరెక్టర్ స్థాయికి తగవు, మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదు అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కొందరు త్రినాథరావును బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో మహిళల గౌరవం పరిరక్షించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ మాటలు ఆ హీరోయిన్‌కి ఖచ్చితంగా అర్థమై ఉండవు. ఎందుకంటే ఆమెకి తెలుగు అసలు రాదు. అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక సైలెంట్‌గా ఉంది. కానీ పక్కనే ఉన్న తెలుగు హీరోయిన్ రీతూ వర్మ, హీరో సందీప్ కిషన్, రావు రమేష్ సహా మూవీ టీమ్ అంతా ఈ కామెంట్లకి ఏం చేయాలో తెలీక నవ్వారు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. హీరోయిన్ అన్షు అభిమానులు కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటిని ఆమె ప్రతిభకు బదులుగా, ఆమె రూపానికి పరిమితం చేసి మాట్లాడటం సిగ్గుచేటు అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వివాదం పెరుగుతుండటంతో త్రినాథరావు తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
SHOCKING: Mazaka director Trinadha Rao Nakkina makes derogatory comments on heroine Anshu size. pic.twitter.com/lmUqhaXHLb
— Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2025