Samantha: డేరింగ్ స్టెప్ వేసిన సమంత.. అసలు విషయాన్ని బయట పెట్టిన నందిని రెడ్డి?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు డేరింగ్ స్టెప్ తీసుకుందట. ఇదే విషయాన్ని తాజాగా డైరెక్టర్ నందిని రెడ్డి చెప్పుకొచ్చింది.
- By Anshu Published Date - 11:00 AM, Tue - 11 March 25

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది సమంత. ఇకపోతే సామ్ గత ఏడాది విజయ్ దేవరకొండ సరసనా ఖుషి సినిమాలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సమంత సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది సమంత. ముఖ్యంగా సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఎక్కువగా ట్రోల్ అవుతుంటుంది. ఇక మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సామ్, రెండు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో, హాలీవుడ్‌లో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.
ఇకపోతే సమంత సొతంగా, త్రేలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇందులోనే మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత కీలక పాత్రలో నటిస్తోంది. ఇకపోతే నందిని రెడ్డి సమంత ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సమంతకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.
అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంటూ సమంతకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. చిత్ర పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. హీరోలు 100 కోట్లు తీసుకుంటే నటీమణులు 20 కోట్లు కూడా దాటలేదు. దీంతో సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందట. మార్పు తనతోనే మొదలు అవ్వాలని, తన సినిమాలో అందరికీ సమానంగా జీతం ఇచ్చిందట. ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ సమంత చూస్తుందని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు., ఈ సందర్భంగా నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరగా మారాయి.