Harish Shankar : రవితేజకు షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..!
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న హరీష్ శంకర్ కు షాక్ సినిమాతో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత మిరపకాయ్ తో
- Author : Ramesh
Date : 05-08-2024 - 9:32 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Shankar మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా మిస్టర్ బచ్చన్ (Mr Bacchan). ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన చివరి రోజు షూట్ ఆదివారం పూర్తి చేశారు. ఆరోజు ఫ్రెండ్ షిప్ డే అవ్వడం వల్ల హరీష్ శంకర్ రవితేజకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాడు.
రవితేజ చేతికి బ్యాండ్ కట్టాక హరీష్ శంకర్ కిందకు వంగి రవితేజ కాళ్లకు నమస్కారం పెట్టాడు. రవితేజ వెంటనే వద్దని పైకి లేపాడు. ఈ సీన్ చూసి హరీష్ శంకర్ కి రవితేజ మీద ఉన్న రెస్పెక్ట్ ఏంటన్నది అర్ధమైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న హరీష్ శంకర్ కు షాక్ సినిమాతో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆ తర్వాత మిరపకాయ్ తో మెప్పించారు.
రవితేజకు మాస్ మహరాజ్ ట్యాగ్ కూడా పెట్టింది హరీష్ శంకరే. తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన హీరోగా కష్టపడి పైకొచ్చిన రవితేజ (Raviteja)ను చూసి ఎప్పుడు స్పూర్తి పొందుతాడు హరీష్ శంకర్. అందుకే ఆయన్ను తన దేవుడు అని అంటున్నాడు హరీష్ శంకర్. ఇక తాజాగా ఫ్రెండ్ షిప్ డే రోజు రవితేజ మీద ఉన్న అభిమానం ప్రేమను కాళ్లకు నమస్కరించి చూపించాడు.
ఇది చూసిన తర్వాత హరీష్ శంకర్ మీద మాస్ రాజా ఫ్యాన్స్ నుంచి మరింత రెస్పెక్ట్ పెరిగింది. స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ రవితేజ మీద చూపించిన రెస్పెక్ట్ కు అందరు సూపర్ అనేస్తున్నారు.
Yeh Dosti Hum Nahin Todenge…❣️@RaviTeja_offl ♾️ @harish2you 💞#RaviTeja #MrBachchan pic.twitter.com/iEcB06eNlS
— Neeraj Kumar (@73forever_) August 5, 2024