HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Plans Enter Politics

Dil Raju: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న దిల్ రాజు.. ఏ పార్టీ నుంచో తెలుసా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో

  • Author : Anshu Date : 24-03-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dil Raju
Dil Raju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు కూడా ఒకరు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా కూడా హైలెట్ అవుతూ వస్తున్నారు దిల్ రాజు. స్టార్ హీరోల సినిమాలకు కోట్లలో బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలను అందిస్తున్నారు.

ఇక దిల్ రాజ్ ఎదుగుతున్న కొద్ది ఇండస్ట్రీలో శత్రువులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇక ఆయన ఎదుగుదలను చూసి ఆయనపై బురద జల్లే వారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. అటువంటి వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత దిల్ రాజుకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే గతంలో చాలాసార్లు దిల్ రాజు పొలిటికల్ లోకి ఎంటర్ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాలపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరికొద్ది రోజుల్లోనే దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల దిల్ రాజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ నిజామాబాద్ జిల్లాలో కలిసి కనిపించారు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో హాథ్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిర్మల దిల్ రాజు తన సొంత గ్రామం అయిన నర్సింగ్ పల్లిలో ఆయన సొంత డబ్బుతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయానికి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనతో కలిసి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు దిల్ రాజు. దాంతో దిల్ రాజు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు అన్న వార్తలు ఊపందుకున్నాయి. దానికి తోడు రేవంత్ రెడ్డి తో చాలా చనువుగా కనిపిస్తుండడంతో తప్పకుండా కాంగ్రెస్ దిల్ రాజు పార్టీ తరపున పోటీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • political entry
  • revanth reddy
  • tollywood

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

Latest News

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd