Game Changer : ముందు పుష్ప.. వెనుక విశ్వంభర.. మధ్యలో గేమ్ ఛేంజర్..
గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. గత మూడేళ్ళ చరణ్ అభిమానుల నిరీక్షణకి..
- Author : News Desk
Date : 22-07-2024 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
Game Changer : రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడు పూర్తీ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం నిన్నటి వరకు రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. ఇక దర్శకుడు శంకర్ ఏమో.. ఫైనల్ ఎడిట్ ఓకే అయిన తరువాతే రిలీజ్ డేట్ పై ఆలోచన చేస్తామంటూ చెప్పుకొచ్చారు.
దీంతో ఈ సినిమా ఈ ఏడాది రావడం కష్టమే అనే వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలు చూసిన చరణ్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు వారిని సంతోషపరిచేలా దిల్ రాజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ధనుష్ ‘రాయన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు, గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ‘క్రిస్మస్ కి కలుద్దాం’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటతో చరణ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Producer #DilRaju Confirmed 💯
Global Star #RamCharan and #KiaraAdvani starrer Much Awaited #Shankar Directorial #GameChanger set to arrive on Christmas, 2024.
After Global Blockbuster – #RRR, Game Changer is the 1st film of @AlwaysRamCharan set to release. 🌟 pic.twitter.com/EEX0OFH0vn
— Ashwani kumar (@BorntobeAshwani) July 21, 2024
క్రిస్మస్ హాలిడేస్ తో లాంగ్ వీకెండే కలిసొస్తున్నట్లు అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొన్నిరోజుల ముందు అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ఆ తరువాత కొన్నిరోజులకు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇలా రెండు బడా సినిమాల రిలీజ్ మధ్యలో వస్తున్న గేమ్ ఛేంజర్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.