Dil Raju : ఎన్నడూలేనిది దిల్ రాజు ఇంత ఆగ్రహానికి లోనయ్యారు ఏంటి..?
- By Sudheer Published Date - 07:52 PM, Mon - 8 January 24
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రబ్యూటర్ అంటే దిల్ రాజు పేరే చెపుతారు. దిల్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజు ..ఆ సినిమాతోనే దిల్ రాజు గా మారిపోయారు. అంతకు ముందు వరకు డిస్ట్రబ్యూటర్ గా పలు సినిమాలను డిస్ట్రబ్యూట్ చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా సక్సెస్ అందుకున్న తర్వాత ఓ పక్క సినిమాలు నిర్మిస్తూనే..మరోపక్క డిస్ట్రబ్యూటర్ గా రాణిస్తూ వస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా వస్తుందన్న..ఆయన డిస్ట్రబ్యూట్ చేస్తున్న సినిమా వస్తుందన్న ప్రేక్షకుల్లో ఆసక్తి అనేది కామన్ గా మారింది. ఎక్కువగా ఫ్యామిలీ కథలతో సినిమాలు చేసే రాజు..ఎంతోమందికి ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ మూవీ చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబదించిన షూటింగ్ కొనసాగుతుంది. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గుంటూరు కారం మూవీకి సంబంధించి నైజాం రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. జనవరి 12 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అదే రోజున తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి దిల్ రాజు నైజాం లో ఎక్కువ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకున్నారని..ఇదొక్క సినిమా విషయంలోనే కాదు ప్రతి సంక్రాంతి టైం లో రాజు నుండి వచ్చే సినిమా కే ఎక్కువ థియేటర్స్ ఉంచుకొని మిగతా వాటికీ ఇబ్బందికి గురి చేస్తుంటాడని పలు మీడియాలలో ప్రచారం చేసారు. అంతే కాదు నిన్న చిరంజీవి..దిల్ రాజు ఫై చేసిన కామెంట్స్ ను కూడా వక్రీకరించి ప్రచారం చేయడం ఫై దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకఫై ఎవరైనా తనపై తప్పుడు వార్తలు రాస్తే ‘తాట తీస్తా’ అని హెచ్చరించారు. ‘హనుమాన్ సినిమాని 12న కాకుండా 14న విడుదల చేస్తే ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను, అంతే కానీ, విడుదల ఆపొద్దు అని చెప్పలేదు’ అని క్లారిటీ ఇచ్చారు. నేను ఒకటి అంటే మరోలా ప్రచారం చేస్తూ..తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని…ఇలా ఇకపై ఎవరైనా చేస్తే బాగోదని..తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
గతంలో దిల్ రాజు ఫై చాలాసార్లు చాలామంది తప్పుడు ప్రచారం చేసినప్పటికీ..ఎప్పుడు పెద్దగా స్పందించని రాజు..ఈసారి ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేసారు..ఎప్పుడు కూల్ గా ఉండే రాజు గారు అంత ఫైర్ అయ్యారంటే ఆయన్ను ఎంతగా హార్ట్ చేసి ఉంటారో అని ఇండస్ట్రీ వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి రాజు గారి హెచ్చరికతోనైనా ఆయనపై తప్పుడు రాతలు రాయడం మానేస్తారో లేదో..
Read Also : MM Keeravani: ‘నా సామిరంగ’ నాగార్జున గారికి యాప్ట్ టైటిల్, సంక్రాంతి కళ ఉట్టిపడేలా ఉంటుంది!
Related News
Vijay Devarakonda Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. ఓకే అనాలంటే మాత్రం ఆ కండీషన్ తప్పనిసరి..!
Vijay Devarakonda Sai Pallavi కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ విజయ్ దేవరకఒండ నెక్స్ట్ సినిమా పోస్టర్ తోనే వారెవా అనిపించేశాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న