Deepthi Sunaina : దీప్తి సునైనా..మరోసారి ప్రేమలో పడిందా..?
'నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
- Author : Sudheer
Date : 27-03-2024 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
దీప్తి సునైనా (Deepthi Sunaina)..ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన అందం, క్యూట్ నెస్ తో యూత్ కు ఆరాధ్య దేవతగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు 70MM స్క్రీన్ ఛాన్స్ రానప్పటికీ, హీరోయిన్లకు మించిన పాపులార్టీ ఈమె సొంతం. వెబ్ సిరీస్ లు , సాంగ్స్, రీల్స్ చేస్తూ నిత్యం నెటిజన్లను అలరిస్తుంటుంది. దీప్తీ సునైనాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు అయ్యాక ట్రోలింగ్ కి గురవుతారు. కానీ, దీప్తీ సునైనా మాత్రం ట్రోలింగ్ తోనే సెలబ్రిటీగా ఎదిగింది. ఆమెను చాలామంది తెగ ట్రోల్ చేసేవాళ్లు. అలాంటి ట్రోల్స్ ని తట్టుకుని తాను అనుకున్నది సాధిస్తూ వస్తుంది. షార్ట్ వీడియోలు, డాన్స్ వీడియోలతో చిన్నపాటి సెలబ్రిటీగా ఎదిగింది. ఆ తర్వాత యూట్యూబ్ సాంగ్స్, బిగ్ బాస్ తో దీప్తీ సునైనా తన కెరీర్ ని పరుగులు పెట్టించింది. దీప్తీ సునైనా బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత నెటిజన్స్ మాత్రమే కాకుండా.. బుల్లితెర ప్రేక్షకులు కూడా దీప్తీ సునైనాని అభిమానించడం ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ భామ తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలకు ఒక క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు మాత్రమే కాదు.. ఆ క్యాప్షన్ కూడా తెగ వైరల్ అవుతోంది. ‘నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో దీప్తి సునైనా మళ్లీ ప్రేమలో పడిందా? అతను ఎవరూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2021లో షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth)తో దీప్తి సునైనా విడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత నుండి దీప్తి సునైనా సింగిల్ గా ఉంది. మరి ఇప్పుడేమైనా మళ్లీ ప్రేమలో పడిందా అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా ప్రేమలో పడిందా..? లేక ఏదైనా ఆల్బమ్ గురించి చెప్పకనే చెప్పిందా..? అని మాట్లాడుకుంటున్నారు.
Read Also : Pothina Mahesh : నిరాహారదీక్ష జనసేనకు టికెట్ దక్కేలా చేస్తుందా..?