Food Poisoning : సినిమా సెట్లో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత
Food Poisoning : ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్యానికి గురవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీని కారణంగా షూటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది
- Author : Sudheer
Date : 19-08-2025 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ధురంధర్’ (Dhurandhar ) షూటింగ్ సెట్‌లో ఒక ఊహించని సంఘటన జరిగింది. లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, చిత్ర యూనిట్‌లోని 120 మందికి పైగా సిబ్బంది ఫుడ్ పాయిజన్ (Food Poisoning) బారిన పడ్డారు. ఇది చిత్ర బృందంతో పాటు, ఆ ప్రాంతంలో ఒక చిన్నపాటి కలకలం రేపింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, సినిమా సిబ్బంది మొత్తం 600 మంది డిన్నర్ చేసిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. భోజనం తిన్న వెంటనే కొందరికి వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారి సంఖ్య క్రమంగా పెరగడంతో, వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం.
Heavy Rain: తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!
ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తెలుసుకునేందుకు భోజనం శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణాలు వెల్లడవుతాయి. ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్యానికి గురవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీని కారణంగా షూటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే, ఈ ఘటనపై హీరో రణవీర్ సింగ్ కానీ, చిత్ర యూనిట్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.