Dhanush : ధనుష్ తో మళ్లీ వెట్రిమారన్..?
Dhanush వెట్రిమారన్ తన తర్వాత సినిమా మళ్లీ స్టార్ హీరోతోనే చేయబోతున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో వెట్రిమారన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ధనుష్, వెట్రిమారన్ ఈ కాంబో సూపర్ హిట్ కాగా
- By Ramesh Published Date - 11:31 PM, Mon - 13 January 25

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా తీస్తే అది పక్కా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అవార్డ్ కొట్టే సినిమాలు తీయాలంటే అది వెట్రిమారన్ వల్లే అనేలా ఆయన సినిమాలు ఉంటాయి. ఈమధ్యనే విడుదల 2 తో ప్రేక్షకులను అలరించిన వెట్రిమారన్ (Vetrimaran) తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది.
వెట్రిమారన్ తన తర్వాత సినిమా మళ్లీ స్టార్ హీరోతోనే చేయబోతున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో వెట్రిమారన్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ధనుష్, వెట్రిమారన్ ఈ కాంబో సూపర్ హిట్ కాగా మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.
ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అతని సొంత డైరెక్షన్ లో ఇడ్లీ కొడై చేస్తున్నాడు. ఈ సినిమాలతో కూడా ధనుష్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ధనుష్ వెట్రిమారన్ కాంబో మరోసారి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నాయి.
వెట్రిమారన్ ధనుష్ (Dhanush) సినిమా వతుందని తెలిసి కోలీవుడ్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మరి ఈ కాంబో నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. వెట్రిమారన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుండగా తప్పకుండా ఈ సినిమా మీద కూడా ఆడియన్స్ అంచనాలు ఏన్ని ఉంటాయో దానికి మించి సినిమా ఉండేలా చూస్తున్నారు. వెట్రిమారన్ సినిమా అది కూడా ధనుష్ హీరో అంటే ఆ సినిమా లెక్క ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గా ఉన్నారు.