Dhanush kubera First Glmpse : కుబేర గ్లింప్స్.. ధనుష్ లుక్స్ అదుర్స్..!
Dhanush kubera First Glmpse శ్రీ వెంకటేశ్వర ఎల్.ఎల్.పి బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా
- By Ramesh Published Date - 09:09 PM, Fri - 15 November 24

ధనుష్ (Dhanush) లీడ్ రోల్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కుబేర. శ్రీ వెంకటేశ్వర ఎల్.ఎల్.పి బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుంచి ఆమధ్య ఒక పోస్టర్ రాగా లేటెస్ట్ గా కుబేర ఫస్ట్ గ్లింప్స్ వదిలారు. కుబేర ఫస్ట్ గ్లింప్స్ ని సూపర్ స్టార్ మహేష్ (Mahesh) తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేశారు.
ఇక ఈ గ్లింప్స్ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం కొన్ని షాట్స్ మాత్రమే చూపించారు. ముఖ్యంగా ఈ Kubera గ్లింప్స్ కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. ధనుష్ డిఫరెంట్ లుక్స్, నాగార్జున (Nagarjuna) స్టైలిష్ లుక్ అదిరిపోయాయి. రష్మిక కూడా న్యాచురల్ లుక్ తో ఆకట్టుకుంది. ధనుష్ కుబేర పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు ఈ గ్లింప్స్ తో మరింత సర్ ప్రైజ్ చేశారు.
సెన్సిబుల్ సినిమాలతో..
కుబేర సినిమా గ్లింప్స్ చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేదు కానీ ఎప్పుడొచ్చినా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అనిపిస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మిక వీరి పాత్రలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి.
శేఖర్ కమ్ముల తన సెన్సిబుల్ సినిమాలతో ఇన్నాళ్లు అలరించగా కుబేర సినిమా తన పరిధి దాటి భారీ స్థాయిలో చేస్తున్నారని తెలుస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది చూడాలి.