Devi Sri : డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కు షాక్ ఇచ్చిన విశాఖ పోలీసులు
Devi Sri : ఈ నెల 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో జరగాల్సిన ఈ ప్రోగ్రాంకు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు
- By Sudheer Published Date - 11:48 AM, Wed - 16 April 25

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ (DSP) తన సంగీత ప్రదర్శన కోసం విశాఖపట్నం(Vizag)లో నిర్వహించబోయే మ్యూజికల్ కాన్సర్ట్ (Musical Concert) కు అనూహ్యంగా అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నెల 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో జరగాల్సిన ఈ ప్రోగ్రాంకు విశాఖ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ఆన్‌లైన్ టికెట్లను భారీగా అమ్మకానికి ఉంచగా, తాజా పోలీసు నిర్ణయం ఆర్గనైజర్లు, అభిమానులకు షాక్ కు గురి చేసింది.
Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
విశాఖ సిటీ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించిన వివరాల ప్రకారం.. భద్రతా పరంగా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇటీవల విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లోని వాటర్ వరల్డ్ లో ఒక బాలుడు చనిపోయిన ఘటన నేపథ్యంలో ఈ ప్రాంగణంలో ఈవెంట్ నిర్వహించడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈ ఘటనతో దేవీశ్రీ ప్రసాద్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకులు ఇప్పటికే అమ్మిన టికెట్లకు తిరిగి డబ్బులు ఎలా ఇస్తారు? లేక వేదికను మార్చి కార్యక్రమాన్ని మరో తేదీకి వాయిదా వేస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రత విషయాల్లో రాజీ పడకూడదన్న పోలీసుల దృక్పథం పట్ల కొందరు మద్దతు తెలుపుతుండగా, ఇటీవలి దుర్ఘటనతో ఈవెంట్‌ను పూర్తిగా రద్దు చేయడంపై మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.