Devara: ఆగిపోయిన దేవర సినిమా షూటింగ్.. మళ్లీ మొదలయ్యేది అప్పుడే?
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల న
- By Nakshatra Published Date - 10:30 AM, Thu - 1 February 24
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను సమ్మర్ లో అనగా 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే విడుదల తేదీని వాయిదా వేసేలా కనిపిస్తోంది.
గత కొద్ది రోజులుగా దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాదు రిలీజ్ డేట్ ను మార్చబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజమే అనేట్లుగా సినిమా షూటింగ్ సడన్‌గా ఆగిపోయింది. ఇక ఫిబ్రవరి రెండో వారంలోనే షూటింగ్ తిరిగి మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యిందని కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి ఈ ఏడాది సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే సినిమా షూటింగ్ ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.
అయితే సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటం వల్లే సినిమా షూటింగ్‌కి బ్రేక్ వేయాల్సి వచ్చిందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం దేవర సినిమా ఏప్రిల్ 5న విడుదల కాకపోతే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను అదే తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. కాగా మరోవైపు దేవర సినిమాకి భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్‌కి కళ్లు చెదిరే రేటు దక్కింది. హంసిని ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.27 కోట్లకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేశారని టాక్. మరి ఈ వార్తలన్నింటిపై క్లారిటీ రావాలంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేసి చూడాల్సిందే మరి.
Related News
Pooja Hegde : టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డే.. స్టార్ బోయ్ సిద్ధు ప్లానింగ్ అదుర్స్..!
Pooja Hegde డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టి టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు చెప్పి మరీ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నాడని తెలిసిందే. డీజే టిల్లు ఎలాంటి అంచనాలు లేకుండా