Devara : తెలుగు రాష్ట్రాల్లో రూ.’100 కోట్ల ‘ మార్క్ క్రాస్ చేసిన దేవర
Devara : ఆరు రోజుల వ్యవధిలో ‘దేవర’ తెలుగు రాష్ట్రాల షేర్ రూ.110 కోట్లకు చేరువైంది. నైజాంలో రూ.42 కోట్ల మేర షేర్ రావడం విశేషం.
- By Sudheer Published Date - 03:06 PM, Fri - 4 October 24

టాక్ (Movie Talk) తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దేవర (Devara) ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రస్తతం హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు , అభిమానులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం లేదు..అలాగే ఇంటర్ నెట్ లో సినిమా రిలీజ్ రోజే మంచి క్వాలిటీ తో సినిమా లీక్ అవుతుండడం తో థియేటర్ కు వెళ్లి వందలు ఖర్చు పెట్టుకొని సినిమా చూసే బదులు ఫోన్లలోనే సినిమా చూస్తే అయిపోద్ది కదా అని చెప్పి చాలామంది థియేటర్ వైపే చూడడం లేదు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించడం..అది కూడా నెగిటివ్ టాక్ తో..అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.
దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR – Koratala Shiva) కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. తారక్ తో జాన్వి కపూర్ జత కట్టగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. దీంతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురుచూసారు. కానీ శివ మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేసాడు. కథ – కథనం కొత్తగా లేకపోవడం..నిడివి కూడా ఎక్కువగా ఉండడం తో బోర్ ఫీల్ అయ్యారు. మొదటిరోజే అభిమానుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు వచ్చిన ఈ టాక్ తో మేకర్స్ ఖంగారు పడ్డారు. ఈ టాక్ ఫలితం కలెక్షన్ల పై ఏ రేంజ్ ప్రభావం చూపుతుందో అని అనుకున్నారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబోతుండడం తో అంత హ్యాపీ గా ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో దేవర రూ.100 కోట్ల మార్క్ ను దాటేసింది.
ఆరు రోజుల వ్యవధిలో ‘దేవర’ తెలుగు రాష్ట్రాల షేర్ రూ.110 కోట్లకు చేరువైంది. నైజాంలో రూ.42 కోట్ల మేర షేర్ రావడం విశేషం. సీడెడ్లో ఈ చిత్రం రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వైజాగ్‌లో రూ.11 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ వచ్చింది. ఏపీలోని మిగతా ఏరియాలన్నీ కలిపితే రూ.28 కోట్ల మేర షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే ‘దేవర’ షేర్ రూ.200 కోట్లకు చేరువగా ఉండొచ్చు. గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లను దాటిపోయాయి. రెండో వీకెండ్లో కూడా సినిమా బాగా ఆడేలా కనిపిస్తోంది. ఇటీవలే ‘దావూది రే’ పాటను యాడ్ చేశారు. దీని కోసం తారక్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వస్తారనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగానే చూస్తున్నారు. సో ఈ దసరా సెలవులను దేవర వాడుకుంటాడని సినీ వర్గాలు చెపుతున్నాయి.
Read Also : CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు