Devara : రూ.500 కోట్ల క్లబ్ లో దేవర
Devara : దసరా సెలవులు ఉండడం తో థియేటర్స్ జనాలతో కళాకలాడుతున్నాయి. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
- By Sudheer Published Date - 01:55 PM, Sun - 13 October 24

జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (Devara) కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం సినిమా కు హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు , అభిమానులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడడం లేదు..అలాగే ఇంటర్ నెట్ లో సినిమా రిలీజ్ రోజే మంచి క్వాలిటీ తో సినిమా ప్రింట్ వస్తుండడంతో థియేటర్ కు వెళ్లి వందలు ఖర్చు పెట్టుకొని సినిమా చూసే బదులు ఫోన్లలోనే సినిమా చూస్తే అయిపోద్ది కదా అని చెప్పి చాలామంది థియేటర్ వైపే చూడడం లేదు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించడం..అది కూడా నెగిటివ్ టాక్ తో..అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.
దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన మూవీ దేవర. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR – Koratala Shiva) కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. తారక్ తో జాన్వి కపూర్ జత కట్టగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. మొదటిరోజే అభిమానుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు వచ్చిన టాక్ తో మేకర్స్ ఖంగారు పడ్డారు. ఈ టాక్ ఫలితం కలెక్షన్ల పై ఏ రేంజ్ ప్రభావం చూపుతుందో అని అనుకున్నారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబోతుండడం తో అంత హ్యాపీ గా ఉన్నారు. ముఖ్యంగా దసరా సెలవులు ఉండడం తో థియేటర్స్ జనాలతో కళాకలాడుతున్నాయి. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండు వారాల్లోనే రూ.400 కోట్లు రాబట్టిన.. ఆ తర్వాత వసూళ్లు కాస్త నెమ్మదించగా తాజాగా రూ.500 కోట్లకు చేరింది.
A Sea of Blood
and a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎
&
Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024
Read Also : Women Salary: ఈ దేశాల్లో పురుషుల కంటే మహిళల జీతాలే ఎక్కువ!