Devara : భారీగా పడిపోయిన కలెక్షన్స్
Devara : తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కేవలం రూ.29.4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. హిందీ రూ. 9 కోట్లు , తమిళంలో రూ.1కోటి, కన్నడలో రూ.35 లక్షలు, మళయాలంలో రూ.25 లక్షలు
- By Sudheer Published Date - 10:45 AM, Sun - 29 September 24

టాలీవుడ్ (Tollywood) తో పాటు పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న “దేవర” (Devara) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ – కొరటాల శివ (Koratala siva) కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర”. జనతా గ్యారేజ్ తర్వాత శివ – ఎన్టీఆర్ కలయిల్లలో సినిమా తెరకెక్కడం..అది కూడా ఎన్టీఆర్ సోలో గా ఆరేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ పోటీ పడ్డారు. అభిమానుల ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ను భారీ ఎత్తున రిలీజ్ చేసారు. కానీ అంచనాలను అందుకోవడం లో సినిమా విఫలం కావడం తో రెండో రోజు కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.
దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.68 కోట్లు రాబట్టగా.. హిందీలో రూ.7 కోట్లు, తమిళం రూ.80 లక్షలు, కన్నడ రూ.30, మళయాలంలో రూ.30 రాబట్టింది. కానీ రెండో రోజు మాత్రం అన్ని చోట్ల భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కేవలం రూ.29.4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. హిందీ రూ. 9 కోట్లు , తమిళంలో రూ.1కోటి, కన్నడలో రూ.35 లక్షలు, మళయాలంలో రూ.25 లక్షలు రాబట్టింది. ఈ రెండు రోజులు కలిపి మొత్తం రూ.122.5 కోట్లు సాధించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవరకు హైదరాబాద్ లో అత్యధికంగా 80 శాతం ఆక్యుపెన్సీ ఉంది. నైట్ షోలకు 94 శాతం ఆక్యుపెన్సీ ఉండగా సాయంత్రం 87 శాతం, మధ్యాహ్నం 78 శాతంగా నడుస్తుంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే..బాక్స్ ఆఫీస్ వద్ద దేవర కలెక్షన్ల వర్షం కురిపించి ఉండేదని అంత భావిస్తున్నారు.
Read Also : Nepal Floods : నేపాల్‌లో వరదల బీభత్సం.. 112 మరణాలు.. వందలాది మంది గల్లంతు