Gaddar Awards : గద్దర్ అవార్డుల కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Gaddar Awards : ఈ సమావేశంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులు వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించి, అవార్డులను ఇవ్వాల్సిన పద్ధతులు, ప్రమాణాలపై పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకున్నారు
- By Sudheer Published Date - 02:20 PM, Sat - 18 January 25

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం డా. బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గద్దర్ అవార్డుల (Gaddar Awards) కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గద్దర్ అవార్డుల వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులు వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించి, అవార్డులను ఇవ్వాల్సిన పద్ధతులు, ప్రమాణాలపై పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకున్నారు. అక్టోబర్ నెలలో కూడా భట్టి..గద్దర్ వేడుకలకు సంబదించిన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మరోసారి సమావేశమయ్యారు.
గద్దర్ అవార్డ్స్ కు సంబంధించి లోగో , విధివిధానాలు , నియమ నిబంధనలు కమిటీ చేసిన ప్రతిపాదనలు , సూచనల గురించి చర్చించారు. గద్దర్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరపాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఈ అవార్డ్స్ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అనే మాదిరిగా ఉందని వివరించారు. త్వరలోనే కమిటీ సూచనలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామని భట్టి పేర్కొన్నారు. ఇక ఈరోజు జరిగిన సమావేశంలో బి. నరసింగ్ రావు , నిర్మాత దిల్ రాజు , జయసుధ తదితరులు పాల్గొన్నారు.
ఇక గద్దర్ అవార్డ్స్ విషయానికి వస్తే..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ అవార్డులలో ఒకటి. ఈ అవార్డులను తెలంగాణా సంస్కృతి, సాహిత్యం, సమాజ సేవలు, రాజకీయ రంగాలలో చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వడం జరుగుతుంది. సమాజాన్ని ప్రేరేపించే పాటలతో, ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు గద్దర్ పేరుతో ఇవ్వడం విశేషం,