దీపికా ఇయర్ రింగ్స్ ఖరీదు ఎంతో తెలుసా..?
దీపికా పదుకునేకు బాలీవుడ్ విపరీతమైన క్రేజ్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోలకు దీటుగా నటిస్తోంది ఈ బ్యూటీ.
- By Balu J Published Date - 12:09 PM, Tue - 2 November 21
దీపికా పదుకునేకు బాలీవుడ్ విపరీతమైన క్రేజ్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోలకు దీటుగా నటిస్తోంది ఈ బ్యూటీ. దీపికా నటనలోనే కాకుండా, ఫ్యాషన్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. మోడర్న్ యువతిగా ఆకట్టుకోవాలనుకున్నా, రాజసం ఒలకబోసే రాణి పాత్ర అయినా దీపికకు అతికినట్టుగా సరిపోతాయి. సినిమాల్లోనే కాదు.. బయట ఆమె ధరించే దుస్తులు సైతం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టైంలెస్ డైమండ్ చెవిపోగులతో కూడిన స్వెటర్, స్కర్ట్ ను ధరించి హోయలుపోయింది. కేబుల్ నిట్ పౌడర్ బ్లూ స్వెటర్, రస్ట్ కలర్ పెన్సిల్ స్కర్ట్ ధరించి చిరనవ్వులు చిందిస్తోంది. అందమైన బ్రాస్లెట్, డైమండ్ చెవిపోగులతో పాటు ఖరీదైన వాచ్ పెట్టుకొని కనిపించింది. మీరు కూడా దీపికా లాంటి వజ్రాభరణాలను కూడా ధరించాలనుకుంటున్నారా.. అయితే చోపార్డ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయితే రూ. 3,22,509 ధరతో సొంతం చేసుకోవచ్చు. అయితే సీజన్స్ తగ్గట్టు హీరోయిన్స్ తమ వార్డ్ రోబ్ ను మార్చేస్తుంటారు. దీపికా కూడా సీజన్స్ తగ్గట్టుగా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చుతూ ఉంటుంది. ఇప్పటికే చలికాలం మొదలైంది. వింటర్ నుంచి కాపాడుకునేందుకు దీపికా ఇలాంటి రకమైన దుస్తులను సెలక్ట్ చేసుకుంటోంది.
Related News
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!
Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది