Deepika Padukone : ఫస్ట్ టైం దీపికా ఆ పాత్రలో
Deepika Padukone : ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
- By Sudheer Published Date - 02:46 PM, Tue - 8 April 25

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ – హిట్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Shah Rukh Khan – Director Siddharth Anand) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ (King) సినిమా పై అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈసారి ఆమె శృంగారత్మక పాత్రలో కాకుండా తల్లి పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ టాక్. ఈ పాత్ర ఆమె అభిమానులకు వినూత్న అనుభూతినిచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.
Pulivendula Satish Reddy: సజ్జలకు షాక్.. పులివెందుల సతీశ్‌కు జగన్ కీలక బాధ్యతలు!
ఈ సినిమాలో దీపికా, షారుఖ్ ఖాన్‌కు మాజీ ప్రేయసిగా మరియు సుహానా ఖాన్ తల్లిగా నటించనున్నారు. దీపికా పాత్ర సినిమాకే మేజర్ టర్నింగ్ పాయింట్‌గా మారనుందని, కథలోని ప్రధాన సంఘర్షణలకు ఆమె పాత్రే కేంద్ర బిందువుగా నిలవనుందని సమాచారం. ఇది ఇప్పటి వరకు దీపికా చేసిన పాత్రలన్నింటికంటే భిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘కింగ్’ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇక ఇప్పటికే షారుఖ్, దీపికా, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో వచ్చిన ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1050 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ ముగ్గురు మళ్లీ కలిసి చేస్తున్న ‘కింగ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుహానా ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతుండటంతో పాటు, దీపికా తల్లి పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.