David Warner – Rajendra Prasad : రాజేంద్రప్రసాద్ సరదాగా తిట్టిన దానిపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదే..
డేవిడ్ వార్నర్ ఏమన్నాడో డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
- By News Desk Published Date - 11:30 AM, Wed - 26 March 25

David Warner – Rajendra Prasad : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో SRH తరపున ఆడి తెలుగులో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక తెలుగు సినిమాల సాంగ్స్, డైలాగ్స్ కి రీల్స్ చేసి మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ లో డేవిడ్ వార్నర్ ని చూపించారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వార్నర్ వచ్చి సందడి చేసాడు.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వార్నర్ తో రాజేంద్రప్రసాద్ కి ఉన్న చనువుతో సరదాగా మాట్లాడుతూ అనుకోకుండా ఓ తప్పుడు పదం వాడుతూ వార్నర్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన సరదాగా అన్నా కొంతమంది సోషల్ మీడియాలో వార్నర్ ని అవమానించారు అని హడావిడి చేసారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ నిన్న నేను కావాలని అనలేదు అయినా సారి చెప్తున్నాను అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు.
అయితే దీనిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడో డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వెంకీ కుడుముల రాజేంద్రప్రసాద్ – వార్నర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. వాళ్ళిద్దరికీ షూటింగ్ సెట్ లో మంచి అనుబంధం ఏర్పడింది. రాజేంద్రప్రసాద్ నువ్వు యాక్టింగ్ కి రా చూసుకుందాం అంటే వార్నర్ నువ్వు క్రికెట్ కి రా చూసుకుందాం అనుకునేవాళ్లు. అలా సరదాగా మాట్లాడుకునేదాన్ని రాజేంద్రప్రసాద్ గారి స్టేజిపై అదే అందాం అనుకున్నారు. ఫ్లోలో ఓ పదం దొర్లింది. దానికి ఆయన సారి కూడా చెప్పారు. ఈ విషయం నేను వార్నర్ తో మాట్లాడితే లైట్ తీసుకోండి. మీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసు కదా. మా స్లెడ్జింగ్ ముందు ఇది నథింగ్. మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది అని అన్నారు.
వాళ్లిద్దరూ బానే ఉన్నా రాజేంద్రప్రసాద్ ఏదో అన్నారు అని సోషల్ మీడియాలో హడావిడి చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు.
Also Read : Chiranjeevi – Anil Ravipudi : పండగ పూట మొదలుపెట్టబోతున్న అనిల్ రావిపూడి – చిరంజీవి..