Nani and Keerthy suresh: కొత్త లుక్స్ లో ‘దసరా’ జంట.. పిక్స్ వైరల్!
నాని కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్స్ పక్కనపెట్టి సరికొత్త గెటప్పుల్లో (New Looks) కనిపించబోతున్నారు.
- Author : Balu J
Date : 13-01-2023 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
డిఫరెంట్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ నాచురల్ స్టార్ నాని (Nani). ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో మెప్పించాడు. ఈ హీరో తాజాగా దసరా (Dasara) మూవీతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ కూడా కథాబలమున్నా సినిమాలు చేస్తోంది. నేను లోకల్ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ దసరా (Dasara)నే. వీరిద్దరు ఎలాంటి ప్రాతలు చేసేందుకైనా ఉత్సాహం చూపుతారు.
దసరా సినిమాలో నాని కీర్తి సురేష్ ఇద్దరు కూడా వారి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్స్ పక్కనపెట్టి సరికొత్త గెటప్పుల్లో కనిపించబోతున్నారు. పూర్తిస్థాయిలో గ్లామర్ ను పక్కనపెట్టి గుడిసెలో ఉండే సింగరేణి కార్మికుల తరహాలో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమాలో నాని అలాగే కీర్తి సురేష్ డి గ్లామర్ పాత్రల్లో మెప్పించబోతున్నారు. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మొత్తం కూడా పూర్తి కావడంతో నాని (Nani) మరో లుక్ లోకి వచ్చేసాడు.
అలాగే కీర్తి సురేష్ కూడా మరొక లుక్ లోకి మారిపోయిన విధానం ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇద్దరు కూడా దసరా (Dasara) సినిమా సెట్ లో వారి పాత్రలతో దిగిన సెల్ఫీ తో పాటు లేటెస్ట్ గా సరికొత్త లుక్స్ తో దిగిన మరొక సెల్ఫీ ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక రెండు ఫోటోలను గమనిస్తే యాక్టింగ్ విషయంలో ఎంతగా మనసుపెట్టి నటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh) అయితే ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో పాటు ఇతర సినిమాలు చేస్తోంది.
Also Read: Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’