2024 Oscar Nominations : 2024 ఆస్కార్ నామినేషన్స్ కు నాని మూవీ
- By Sudheer Published Date - 08:05 PM, Fri - 19 January 24

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే అందరికి చిన్న చూపు ..కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆసక్తి గా ఎదురుచూస్తున్న స్థాయికి చేరింది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి వల్ల తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పాలి. మగధీర , ఈగ , బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలు తెలుగు సినిమా అంటే ఏంటో చూపించాయి. ఇక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డు (2023 Oscar Award) అందుకొని యావత్ ప్రపంచం శభాష్ తెలుగోడా అనేలా చేసింది.
గత ఏడాది నిర్వహించిన 95th అకాడమీ అవార్డ్స్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో “నాటు నాటు” పాట (Naatu Naatu Song) ఆస్కార్ అవార్డును సొంత చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ పాటకు ఆస్కార్ పురస్కారాన్నీ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రమే కాదు భారత దేశం నుంచి ఎలిఫాంట్ విష్పర్స్ అనే డాక్యుమెంట్రీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమా 2024 ఆస్కార్ (2024 Oscar Nominations) బరిలో నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘దసరా’ మూవీ ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని తన టైటిల్ కు తగ్గట్టు చాలా నేచరల్ గా నటించాడు. ఇక ఆయనకు పర్ఫెక్ట్ జోడీగా కీర్తి సురేశ్ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చూసిన ఈ మూవీ హిట్ గా నిలిచింది. దీంతో పాటు మరికొన్ని భారతీయ చిత్రాలు ఆస్కార్ నామినేషన్ కు వెళ్లాయి. అవి ఏంటో చూద్దాం.
ఆస్కార్ కు నామినేట్ అయినా భారతీయ చిత్రాలు
దసరా (తెలుగు)
విడుతలై పార్ట్ 1 (తమిళ్)
దీ స్టోరీ టెల్లర్ (హిందీ)
సంగీత పాఠశాల (హిందీ)
కేరళ స్టోరీస్ (హిందీ)
శ్రీమతి ఛటర్జీ VS నార్వే (హిందీ)
డంకీ (హిందీ)
12TH ఫెయిల్ (హిందీ)
ఘూమర్(హిందీ)
జ్వీగాటో (హిందీ)
రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)
ఇప్పటి వరకు ఈ సినిమాలు నామినేట్ అయినట్లు తెలుస్తుంది. మరి కొన్ని భారతీయ చిత్రాలు ఆస్కార్ జాబితాలో చేరే అవకాశం ఉంది.
Read Also : Tata Nexon: కేవలం రూ.13 వేలకే టాటా నెక్సన్ కారును సొంతం చేసుకోవచ్చట.. అదెలా అంటే?