Manikanta : అనాథలను చదివిస్తా.. పేద పిల్లలకు వైద్యం చేయిస్తా.. ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స్ మాస్టర్ మణికంఠ..
ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న డ్యాన్సర్ మణికంఠ(Dancer Manikanta) డబ్బులు సంపాదించడమే కాక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.
- Author : News Desk
Date : 26-10-2023 - 3:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఢీ(Dhee), జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ తో ఎంతోమందికి అవకాశాలు దొరికి సెలబ్రిటీలు అయ్యారు, పైకి ఎదిగారు. వారిలో చాలా మంది ప్రస్తుతం పలు సినిమాలు, షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉంటూనే ఫుల్ గా సంపాదించుకుంటున్నారు. అలా ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న డ్యాన్సర్ మణికంఠ(Dancer Manikanta) డబ్బులు సంపాదించడమే కాక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు.
మణికంఠ ఢీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాఘవ లారెన్స్ అంటే వీరాభిమానం మణికంఠకు. పలుమార్లు రాఘవ లారెన్స్(Raghava Lawrence) సినిమా ఈవెంట్స్ లో డ్యాన్స్ చేసి అయన దగ్గర పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ మాస్టర్ కూడా మణికంఠని పలుమారు అభినందించాడు. అలాగే మణికంఠ కూడా తనలాగే సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలియడంతో అతన్ని ప్రోత్సహిస్తూ అతనికి సపోర్ట్ గా ఉంటాను అని కూడా చెప్పారు.
తాజాగా మణికంఠ విజయనగరం జిల్లాలోని భోగాపురంకి ఒక ఈవెంట్ కి వెళ్లగా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. మీ గ్రామంలో ఎవరైనా అనాధ పిల్లలు ఉండి చదువుకోవాలన్నా, డబ్బుల్లేక వైద్యం చేయించుకోవాలన్నా నాకు చెప్పండి నేను సహాయం చేస్తాను అని తెలిపాడు.అందుకు తన టీం ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాడు.
ఈ విషయాన్ని మణికంఠ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే మణికంఠ తన సంపాదనలో 20 శాతం సేవా కార్యక్రమాలకు ఇస్తున్నాను అని కూడా తెలిపాడు. దీంతో పలువురు మణికంఠ మాస్టర్ ని అభినందిస్తున్నారు.
Also Read : Anchor Suma : మీడియాపై సుమ సెటైర్లు.. అనంతరం సారి చెప్పిన సుమ..