Family Star : ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు..
సినిమా రిలీజ్ కి ముందు కూడా సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేసిన పోస్టులు, కావాలని నెగిటివిటి సృష్టిస్తున్న అకౌంట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Author : News Desk
Date : 07-04-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల ఏప్రిల్ 5న రిలీజయింది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నా కొంతమందికి నచ్చకపోవడంతో పాటు, విజయ్ దేవరకొండ అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమా బాలేదంటూ పోస్టులు చేస్తున్నారు.
దీనివల్ల ఫ్యామిలీ స్టార్ సినిమాకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. దిల్ రాజు స్వయంగా థియేటర్స్ కి వెళ్లి ఆడియన్స్ ని సినిమా ఎలా ఉంది అంటూ రివ్యూలు తీసుకుంటున్నారు. థియేటర్స్ వద్ద మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళని, కావాలని సినిమాని బ్యాడ్ చేయడానికి చూస్తున్న వారిని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇలా సినిమా రిలీజ్ కి ముందు కూడా సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేసిన పోస్టులు, కావాలని నెగిటివిటి సృష్టిస్తున్న అకౌంట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ పర్వతనేని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. కంప్లైంట్, ఆధారాలు తీసుకున్న పోలీసులు కేసు విచారించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
Also Read : Premalu Telugu OTT : ప్రేమలు OTT తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా..!