Bigg Boss : బిగ్‌బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చిన సీపీఐ నారాయణ
ఏ సంబంధం లేని 20, 30 మంది ఒకే ఇంట్లో ఉండడం ఏంటి? దీనిని ఏమనాలి? బిగ్ బాస్ నాకు అనైతికంగా అనిపించింది
- Author : Sudheer
Date : 21-11-2023 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
సీపీఐ నారాయణ (CPI Leader Narayana ) మరోసారి బిగ్ బాస్ (Bigg Boss) షో ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. నార్త్ లో సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో..తెలుగు (Telugu Bigg Boss) లోను అదే విధంగా రాణిస్తుంది. గత సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ..ఈ ఏడో సీజన్ మాత్రం అందర్నీ అంచనాలను తలకిందులు చేస్తూ అత్యధిక TRP రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఈ షో ఫై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిగ్‌బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ తో పోల్చి వార్తల్లో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఏ సంబంధం లేని 20, 30 మంది ఒకే ఇంట్లో ఉండడం ఏంటి? దీనిని ఏమనాలి? బిగ్ బాస్ నాకు అనైతికంగా అనిపించింది. ఉద్దేశపూర్వకంగా నేను వివాదం చేయడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఈ షోపై నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షోలో ఆశ్లీలత ఉందని… టాస్కుల పేరిట అసభ్యకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తాను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీ చేయాలని భావించను అన్నారు. కానీ బిగ్ బాస్ అనైతికంగా అనిపించిందన్నారు. అందుకే ఆ షోను పలుమార్లు విమర్శించానన్నారు.
Read Also : Longest Bridge : ఓడలు వస్తే తెరుచుకునే.. రైళ్లు వస్తే మూసుకునే వంతెన