CM Revanth: మెగా సత్కారం, పద్మవిభూషణుడు చిరును సన్మానించనున్న సీఎం రేవంత్
- By Balu J Published Date - 04:54 PM, Sat - 3 February 24

CM Revanth: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమా గర్వపడేలా చేశారు. ఈ ప్రకటన వెలువడడంతో చిరంజీవి అభిమానులు ఒక్కసారిగా ఆనందపడ్డారు. ఇప్పుడు వార్తల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటలకు శిల్ప కళా వేదికలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో చిరంజీవిని సన్మానించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి స్వయంగా చిరంజీవి, వెంకయ్య నాయుడులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు అవార్డు గ్రహీతలను కూడా సత్కరించనున్నారు.
2024గాను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. దీంతో మెగాభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి సరైన సమయంలో దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఒక సామాన్య మధ్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఈయన కెరీర్ విషయానికొస్తే.. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మేరు నగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు.