‘Citadel: Honey Bunny’ : సమంత ‘సిటాడెల్’ టైటిల్ చేంజ్ ..
ఈ టైటిల్ డిజైన్ తోనే.. హనీ అంటే సమంత అని, బన్నీ అంటే వరుణ్ ధావన్ అని తెలుస్తుంది
- Author : Sudheer
Date : 19-03-2024 - 4:54 IST
Published By : Hashtagu Telugu Desk
సమంత (Samantha), బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhavan) కాంబినేషన్లో వస్తున్న సిరీస్ కు ‘సిటాడెల్: హనీ-బన్నీ’ (Citadel Honey Bunny) అనే టైటిల్ ఫిక్స్ చేసారు. “ఫ్యామిలీ మ్యాన్” మరియు “ఫర్జీ” వంటి సూపర్ హిట్ సిరీస్ ల తరువాత దర్శకులు రాజ్ – డికె నుండి వస్తున్న ఈ సిరీస్ ఫై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ “సిటాడెల్” ను ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ” గా అందిస్తున్నారు. ఇద్దరి గూఢచారుల మధ్య ప్రేమ కథతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అమెజాన్ ఒరిజినల్ కంటెంట్ గా వస్తున్న ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటిస్తే.. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇక మేల్ లీడ్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ టైటిల్ డిజైన్ తోనే.. హనీ అంటే సమంత అని, బన్నీ అంటే వరుణ్ ధావన్ అని తెలుస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫా రూపొందిన ఈ సిరీస్.. 90s బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటె అమెజాన్ ప్రైమ్ వీడియో మంగళవారం కొన్ని సరికొత్త షోలను ప్రకటన చేసింది. ఇందులో తెలుగులో ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఇందులో నవీన్ చంద్ర నటించాడు. ఇదొక సూపర్ నేచురల్ హారర్ సిరీస్. మార్చి 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక విజయ్ వర్మ నటిస్తున్న మట్కా కింగ్ అనే మరో కొత్త వెబ్ సిరీస్ ను కూడా ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.
ఇక రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ది రానా కనెక్షన్ కూడా ప్రైమ్ వీడియోలో రానుంది. ఇండియన్ సినిమాలోని తన ఫ్రెండ్స్, సహచరులతో రానా ఏర్పాటు చేసే ఈ టాక్ షో కూడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక రంగీన్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ లను కూడా ప్రకటించింది.
Read Also : Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల