Neha Sharma : రాజకీయాల్లోకి ‘చిరుత’ బ్యూటీ.. ఆ లోక్‌సభ సీటు నుంచి పోటీ!
Neha Sharma : హీరో రామ్‌చరణ్ నటించిన ‘చిరుత’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
- By Pasha Published Date - 05:27 PM, Sat - 23 March 24

Neha Sharma : హీరో రామ్‌చరణ్ నటించిన ‘చిరుత’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. బిహార్‌లోని ఓ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేహా పోటీ చేస్తారని సమాచారం. నేహా తండ్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే(భగల్‌పుర్) అజయ్ శర్మ.. తన కూతురికి లోక్‌సభ టికెట్‌ను సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల అజయ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బిహార్‌లోని భగల్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సీటు మా పార్టీకి వస్తే.. నేను పోటీ చేయడం లేదా నా కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నా. తుది నిర్ణయం హైకమాండ్‌దే’’ అని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ‘ఇండియా’ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. పలు బాలీవుడ్, తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించిన ట్రాక్ రికార్డు నేహా శర్మకు(Neha Sharma) ఉంది.