Gaddar Awards : బన్నీ కి గద్దర్ అవార్డు..చిరు ట్వీట్ అందరికి షాక్
Gaddar Awards : గద్దర్ అవార్డు అందుకున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపిన చిరు, తన ట్వీట్‌లో అల్లు అర్జున్ పేరును ప్రస్తావించలేదు
- Author : Sudheer
Date : 29-05-2025 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డ్స్ ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards) ప్రారంభించింది. ఈరోజు గురువారం ఈ అవార్డ్స్ ను ప్రకటించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (Allu Arajun) గద్దర్ అవార్డు పొందడం సినీ ప్రేమికుల్లో హర్షం కలిగించింది. బన్నీకి ఇటీవలే నేషనల్ అవార్డు రావడంతో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను అందించింది. ఈ అవార్డులు కళాకారులను గౌరవించడమే కాదు, వారి కృషికి అద్దంపడేలా ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రదర్శించిన ప్రతిభకు గద్దర్ అవార్డు మరో గుర్తింపు కావడం అభిమానులను ఉత్సాహంగా ముంచెత్తింది.
అయితే ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Tweet) చేసిన ట్వీట్ కొత్త చర్చలకు తావిచ్చింది. గద్దర్ అవార్డు అందుకున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపిన చిరు, తన ట్వీట్‌లో అల్లు అర్జున్ పేరును ప్రస్తావించలేదు. మామూలుగా చిరంజీవి ఎవరైనా చిన్నా పెద్దా అవార్డు పొందితే అభినందనల వర్షం కురిపించే వ్యక్తిగా పేరుంది. అలాంటి ఆయన, తన కుటుంబంలోని కీలక వ్యక్తి అయిన బన్నీకి ప్రత్యేకంగా విష్ చేయకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వారి కుటుంబాల మధ్య ఉన్న దూరానికి సంకేతమా అన్న చర్చలకు బలం చేకూరుతోంది.
ఇటీవలి కాలంలో మెగా–అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. బన్నీ కొన్ని సినిమాల్లో స్వతంత్రంగా ముందుకు వెళ్లడం, ఇతర స్టార్‌లతో సన్నిహితంగా ఉండటం ఈ మాటల బలాన్ని పెంచాయి. ఇప్పుడు చిరు బన్నీని ట్యాగ్ చేయకపోవడం ఆ వార్తలకు మద్దతిచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది నిజంగా ఉద్దేశపూర్వకమేనా? లేక అనుకోకుండా జరిగిన చిన్న తప్పిదమా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Chiru Gaddar Awards